180 కన్నా ఎక్కువ దేశాల్లో 2 బిలియన్ల మందికి పైగా వ్యక్తులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో1 ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితం2 మరియు ప్రపంచవ్యాప్తంగా ఫోన్లలో అందుబాటులో ఉన్న సరళమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన మెసేజింగ్, కాలింగ్ సౌలభ్యాలను అందిస్తోంది.
1 అవును, WhatsApp అనే పేరు వాట్స్ అప్ అనే పదబంధానికి ద్వంద్వార్థం.
2 డేటా ఛార్జీలు వర్తించవచ్చు.
WhatsApp అనేది SMSకి ప్రత్యామ్నాయంగా ప్రారంభమైంది. మా ఉత్పత్తి ఇప్పుడు క్రింది విభిన్న రకాల మీడియాను పంపడం మరియు స్వీకరించడానికి మద్దతిస్తోంది: వచనం, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు మరియు స్థానం, అలాగే వాయిస్ కాల్లు. మీ అత్యంత వ్యక్తిగత క్షణాలలో కొన్ని WhatsAppతో షేర్ అవుతుంటాయి, అందుకే మేము మా యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రూపొందించాము. ప్రతి ఉత్పత్తి నిర్ణయం వెనుక ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా కమ్యూనికేట్ చేసేందుకు వ్యక్తులను అనుమతించాలనే మా కోరిక ఉంది.
WhatsAppని జాన్ కోమ్ మరియు బ్రియాన్ యాక్టన్ స్థాపించారు, వీరు ఇదివరకు ఉమ్మడిగా Yahooలో 20 ఏళ్ల పాటు పని చేసారు. WhatsApp 2014లో Facebookతో చేతులు కలిపింది, కానీ ప్రపంచంలో ఎక్కడైనా వేగంగా మరియు విశ్వసనీయంగా పని చేసే మెసేజింగ్ సేవను రూపొందించడంపై దృష్టి సారించడంతో విడి యాప్‌గానే నిర్వహించడం కొనసాగిస్తోంది.