మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యి ఉండండి
మీతో WhatsApp చాట్ ప్రారంభించడానికి కస్టమర్‌ల కోసం షార్ట్ లింక్‌ను సృష్టించండి. ఇమెయిల్, మీ వెబ్‌సైట్, Facebook పేజీ, లేదా తరచుగా ఉపయోగించే ఏ ఇతర ఛానెల్స్ ద్వారా అయినా ఈ లింక్‌ను షేర్ చేయండి.
ఈ పెరిగిన అనిశ్చిత మరియు ఐసోలేషన్ సమయంలో సమాజంలోని సభ్యులకు సేవలందిస్తూ మీ వ్యాపారాన్ని నిర్వహించుకోవడమనేది మామూలు రోజుల్లో కంటే మరింత సవాలుకరంగా ఉండగలదు. తమ స్నేహితులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండేందుకు కస్టమర్లు ఉపయోగించే అదే WhatsApp సాధనాన్ని ఉపయోగించి మీరు వారితో కనెక్ట్ అవ్వండి.
మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు దయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని వినియోగదారులను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.
పలు రకాల ప్రశ్నలకు సమర్థంగా బదులీయడంలో మేనేజ్ చేయడానికి, మీ బిజినెస్ ప్రొఫైల్‌లో ఉపయోగకర సమాచారాన్ని ఉంచండి మరియు మీ సేవల గురించి వివరాలను ఒక కేటలాగ్‌లో షేర్ చేయండి, WhatsApp Business యాప్ వాడాలని మేము సిపారసు చేస్తున్నాము, దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WhatsApp వ్యాపార యాప్‌ని ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మీ ఖాతాను WhatsApp Messenger నుండి WhatsApp Business యాప్‌కు తరలించాల్సి వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి..
మీ ఫోన్ కోసం డౌన్‌లోడ్ చేయండి
మీతో WhatsApp చాట్ ప్రారంభించడానికి కస్టమర్‌ల కోసం షార్ట్ లింక్‌ను సృష్టించండి. ఇమెయిల్, మీ వెబ్‌సైట్, Facebook పేజీ, లేదా తరచుగా ఉపయోగించే ఏ ఇతర ఛానెల్స్ ద్వారా అయినా ఈ లింక్‌ను షేర్ చేయండి.
మీ నిర్వహణ సమయాలలో ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మీ కస్టమర్లు తెలుసుకునేలా చేయడంలో జాగ్రత్తపడండి. మీ వ్యాపారం తెరిచి ఉండే రోజులు మరియు సమయాన్ని ప్రదర్శించుకోవడానికి మీ బిజినెస్ ప్రొఫైల్‌ని ఉపయోగించండి.
నిజ సమయంలో మీ కస్టమర్లకు ఏమి లభిస్తుందో షేర్ చేయండి. మీ టాప్ కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి గ్రూప్స్ ఉపయోగించండి మరియు మీ దగ్గర ఏమేమి స్టాక్ ఉందో కస్టమర్లు సులభంగా తెలుసుకునేలా మీ కాటలాగ్ అప్‌డేట్ చేయండి.
మిమ్మల్ని కస్టమర్లు వ్యక్తిగతంగా కలిసినప్పుడు పొందే అదే రకమైన సేవలను వాళ్లతో కనెక్ట్ అయ్యి అందించేందుకు ఎన్‌క్రిప్ట్ చేయబడిన వీడియో మరియు వాయిస్ కాల్స్ ఉపయోగించండి.
నడిచి వచ్చే కస్టమర్ల ట్రాఫిక్, మరియు ఇన్-స్టోర్ సందర్శనలు నెమ్మదించిన తరుణంలో, స్టోర్ పికప్‌లు మరియు డెలివరీల సంఖ్య పెరగవచ్చు. మీరు డెలివరీ చిరునామాను సమీపిస్తున్నప్పుడు WhatsAppలో ప్రస్తుత స్థానం ఫీచర్‌ను ఆన్ చేయండి. ఈ ఫీచర్ మీ లొకేషన్‌ను కస్టమర్లకు షేర్ చేసి, ఒక త్వరిత మరియు సులభతరమైన మార్పిడికి అవకాశం కలిగేలా నిర్ధారిస్తుంది.
మీ కస్టమర్లు ప్రతీసారి మీ స్టోరును సందర్శించడం చూసినప్పుడల్లా ఆనందించడానికి అలవాటుపడ్డారా? స్టేటస్ అప్‌డేట్‌తో వారికి ఒక వర్చువల్ టూర్ అందించండి.
దూరం నుండి మీ బృంద సభ్యులతో కలిసి పనిచేయడానికి గ్రూప్స్ మరియు గ్రూప్ వీడియో కాల్స్ ఉపయోగించండి.
మీకు WhatsApp కరోనావైరస్ సమాచారం హబ్‌కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, మమ్మల్ని సంప్రదించండి.