కరోనా వైరస్ (COVID-19) వ్యాధి వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కనెక్ట్ అయ్యి ఉండేందుకు WhatsApp మీకు ఎలా సాయపడగలదు
ఎడ్యుకేటర్లు
మీరు ఒక పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో బోధిస్తుంటే, విద్యా బోధన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నట్లయితే మీ విద్యార్ధులకు WhatsApp ద్వారా పాఠాలు బోధిస్తూ వారితో నిమగ్నమయ్యేందుకు ఆలోచించండి.*
మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడుదయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని వినియోగదారులను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.
మీరు WhatsAppకి కొత్త అయితే, దాన్ని ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ విద్యార్థులతో కనెక్ట్ అయ్యి ఉండండి
మీ వద్ద విద్యార్థుల ఫోన్ నంబర్లు లేకపోతే, మీతో ఆ విద్యార్థులు WhatsApp చాట్ ప్రారంభించడానికి, ఒక యూనివర్సల్ లింకుని సృష్టించండి. ఇమెయిల్, మీ Facebook పేజీ, లేదా ఏ ఇతర ప్రైవేట్ ఛానెల్ ద్వారా అయినా ఈ లింకును షేర్ చేయండి.
WhatsAppలో పాఠాలను బోధించండి
టెక్స్ట్ మరియు వాయిస్ మెసేజ్‌లు రూపంలో పాఠాలను షేర్ చేయండి. మీరు తరగతి గదుల్లో నేరుగా చర్చలు ఎలా చేస్తారో సరిగ్గా అలాగే ప్రతీ తరగతికిఒక గ్రూప్ సృష్టించి విద్యార్థుల మధ్య చర్చలు జరిగే సౌకర్యం కల్పించండి.
అసైన్మెంట్లను పంపండి మరియు స్వీకరించండి
అనేక మంది విద్యార్థులకు ఒకేసారి హోమ్‌వర్క్ ఇవ్వడానికి బ్రాడ్కాస్ట్ లిస్ట్స్ ఉపయోగించండి. మిమ్మల్ని తమ ఫోన్లోని అడ్రస్ బుక్కు జోడించుకున్న కాంటాక్టులు మాత్రమే మీ బ్రాడ్కాస్ట్ మెసేజ్‌లు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిస్పందనలు కేవలం మీకే చేరతాయి కాబట్టి వారు తాము పూర్తి చేసిన అసైన్మెంట్లతో మీకు రిప్లై ఇవ్వగలుగుతారు.
మారుమూల ప్రాంతాల నుండి మీ విద్యార్థులకు అందుబాటులో ఉండండి
గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాల్స్ ద్వారా నిజ-సమయంలో నేర్చుకునే అవకాశాలను అందించండి.
మీ కంప్యూటర్ నుండి మెసేజ్‌లను పంపండి
మీ డెస్క్‌టాప్ నుండి పెద్ద సంఖ్యలో WhatsApp మెసేజ్‌లను త్వరితంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించేందుకు WhatsApp Web ఉపయోగించండి.
*మా సేవలను ఉపయోగించుకునేందుకు అవసరమైన కనీస వయసు ఆవశ్యకతతో పాటు WhatsApp వినియోగం, వర్తించే చట్టాలకు మరియు WhatsApp సేవా నిబంధనలకు లోబడి ఉంటుంది. విద్యార్థులు లేదా ఇతరులు WhatsApp ఉపయోగించేందుకు అవసరమైన కనీస వయసు కన్నా తక్కువ ఉన్నట్లయితే, లేదా తప్పనిసరిగా విద్యార్ధులు WhatsApp వాడాలని వారిని ప్రోత్సహించకండి.