మీ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి ఉండండి
మీ కమ్యూనిటీ సభ్యులు మీతో ఒక ప్రైవేట్ WhatsApp చాట్ చేయడానికి ఒక షార్ట్ లింక్‌ని సృష్టించండి. ఇమెయిల్, మీ వెబ్‌సైట్, Facebook పేజీ, లేదా తరచుగా ఉపయోగించే ఏ ఇతర ఛానెల్స్ ద్వారా అయినా ఈ లింకును షేర్ చేయండి.
పెరిగిన అనిశ్చితి మరియు ఐసోలేషన్ సమయంలో, మీ స్నేహితులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండేందుకు ఇప్పటి వరకూ వారు ఉపయోగిస్తూ వచ్చిన అదే చాటింగ్ సాధనమైన WhatsApp సహాయంతో మీ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వండి.
మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు దయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని వినియోగదారులను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.
పలు రకాల ప్రశ్నలకు సమర్థంగా బదులీయడంలో మేనేజ్ చేయడానికి, బిజినెస్ ప్రొఫైల్‌లో ఉపయోగకర సమాచారాన్ని ఉంచండి మరియు మీ సేవల గురించి వివరాలను ఒక కేటలాగ్ లో షేర్ చేయండి, WhatsApp Business యాప్ వాడాలని మేము సిపారసు చేస్తున్నాము, దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WhatsApp వ్యాపార యాప్‌ని ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మీ ఖాతాను WhatsApp Messenger నుండి WhatsApp Business యాప్‌కు తరలించాల్సి వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి..
మీ ఫోన్ కోసం డౌన్‌లోడ్ చేయండి
మీ కమ్యూనిటీ సభ్యులు మీతో ఒక ప్రైవేట్ WhatsApp చాట్ చేయడానికి ఒక షార్ట్ లింక్‌ని సృష్టించండి. ఇమెయిల్, మీ వెబ్‌సైట్, Facebook పేజీ, లేదా తరచుగా ఉపయోగించే ఏ ఇతర ఛానెల్స్ ద్వారా అయినా ఈ లింకును షేర్ చేయండి.
ప్రజలు తమకు అవసరమైన వనరులను ఎక్కడ కనుగొనాలో చెప్పి, అలాగే వారు మీ సేవల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోగలిగేలా మీ వ్యాపార ప్రొఫైల్ పూర్తి చేసి, అనుకూల పలకరింపు సందేశాలను సెటప్ చేయండి.
ముఖ్యంగా ఈ బిజీ సమయంలో, దూరంగా ఉన్నామనే మెసేజ్ ఆటోమేటిక్‌గా పంపబడేలా సెట్ చేసి మీ కమ్యూనిటీకి మీరు ఎంత సమయంలోపు సమాధానం ఇవ్వగలరో చెప్పగలిగితే వారు తమ ప్రణాళికలను దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు.
మీ కమ్యూనిటీకి మీరు అందించే సేవల గురించి తెలియపరచండి. మీ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా యాక్సెస్ చేయగలిగేలా మీ కాటలాగ్‌లో సేవా వివరాలను చేర్చండి.
కమ్యూనిటీ మెంబర్ల ప్రశ్నలకు మీరు తరచుగా పంపే మెసేజ్‌లను త్వరితంగా బదులివ్వండిలో సేవ్ చేసి, మళ్లీ మళ్లీ వాడుకోండి.
వైరస్ వ్యాప్తిని నెమ్మదింపచేయడానికి మీ కమ్యూనిటీ సభ్యులు ఎలా సహయపడవచ్చనే దాని గురించి క్రియాశీలకంగా ముందస్తుగానే తెలియచేసి వారిని చైతన్యపరచండి. మీ స్టేటస్ అప్‌డేట్‌లో ఫోటోలు, వీడియో మరియు టెక్స్ట్ ద్వారా చిట్కాలు తెలియజేయండి.
దూరం నుండి మీ బృందంతో కలిసి పనిచేయడానికి గ్రూప్స్ మరియు గ్రూప్ వీడియో కాల్స్ ఉపయోగించండి.
మీ డెస్క్‌టాప్ నుండి పెద్ద సంఖ్యలో WhatsApp మెసేజ్‌లను త్వరితంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించేందుకు WhatsApp Web ఉపయోగించండి.
మీకు WhatsApp కరోనావైరస్ సమాచారం హబ్‌కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, మమ్మల్ని సంప్రదించండి.