ఆరోగ్య సంరక్షణ నిపుణులు
పెరిగిన అనిశ్చితి మరియు ఐసోలేషన్ సమయంలో, మీరు WhatsApp ద్వారా మీ రోగులు మరియు సహోద్యోగులతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు----ఇదే సాధనాన్ని వారు తమ స్నేహితులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండేందుకు ఉపయోగిస్తుంటారు.
మీ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేటప్పుడు దయచేసి WhatsAppను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీకు తెలిసిన వినియోగదారులతో మరియు మీ నుండి మెసేజ్‌లను స్వీకరించాలనుకునే వారితో మాత్రమే సంభాషించండి, మీ ఫోన్ నంబర్‌ను వారి అడ్రెస్ బుక్‌లో సేవ్ చేయమని వినియోగదారులను అడగండి మరియు గ్రూప్‌లకు ఆటోమేటిక్ లేదా ప్రచార మెసేజ్‌లను పంపకండి. ఈ సరళమైన ఉత్తమ ఆచరణలు పాటించకపోతే, ఇతర వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడం మరియు అకౌంట్ బాన్ అవడం వంటివి జరగవచ్చు.
పలు రకాల ప్రశ్నలకు సమర్ధవంతంగా సమాధానాలు ఇవ్వడంలో మేనేజ్ చేసుకోవడానికి, వ్యాపార సమయాల్లాంటి సహాయకరమైన సమాచారాన్ని ఫీచర్ చేయడానికి, తరచూ బదులిచ్చే సమాధానాలను నిల్వ చేసుకోవడానికి, WhatsApp Business యాప్ ఉపయోగించాలని మేము మీకు సిఫారసు చేస్తున్నాం, దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WhatsApp వ్యాపార యాప్‌ని ఎలా ఉపయోగించాలో దశల వారీగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు మీ అకౌంట్‌ను WhatsApp Messenger నుండి WhatsApp Business యాప్‌కు తరలించాల్సి వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి..
మీ ఫోన్ కోసం డౌన్‌లోడ్ చేయండి
*WhatsApp ఉపయోగించే ప్రతీ వినియోగదారు, తాము యాప్ ద్వారా నిర్వహించే కార్యకలాపాలన్నీ ఆరోగ్య డేటా గోప్యత మరియు భద్రతా చట్టాలతో సహా వర్తించే అన్ని చట్టాలకు కట్టుబడి ఉండేలా జాగ్రత్తపడడంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. WhatsApp ఆరోగ్య సంరక్షణ సేవలను ఏర్పాటు చేయడం లేదా అందించడం చేయదు, మరియు WhatsAppకు అనుబంధంగా మీరు మీ ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాతినిథ్యం వహించడం లేదు. WhatsApp అనేది రోగులతో జరిపే వ్యక్తిగత ఆరోగ్య సంప్రదింపులకు లేదా అత్యవసరంగా వైద్య సహాయం అందించాల్సిన పరిస్థితుల్లో చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు మరియు నియంత్రిత వైద్య పరికరంగా దీనిని ఉపయోగించకూడదు.