1. మీ WhatsApp Messenger అకౌంట్ యొక్క బ్యాకప్ సృష్టించండి: మీరు WhatsApp Messenger అకౌంట్ నుండి WhatsApp Businessకు మారుతున్నట్లయితే, ఒక బ్యాకప్ సృష్టించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాం. బ్యాకప్ సృష్టించకపోవడం వల్ల మీ చాట్ హిస్టరీని కోల్పోవలసి వస్తుంది. WhatsApp Messenger తెరవండి. Androidలో, ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్‌లు ట్యాప్ చేయండి. iPhoneలో, మీ చాట్స్ స్క్రీన్ నుండి సెట్టింగ్‌లు ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ నుండి, చాట్స్ ట్యాప్ చేయండి, తర్వాత చాట్ బ్యాకప్ తర్వాత బ్యాకప్ లేదా ఇప్పుడే బ్యాకప్ చేయి ట్యాప్ చేయండి. మీ బ్యాకప్ పూర్తి అయ్యాక, తర్వాతి దశకు వెళ్లండి
2. WhatsApp Business యాప్ డౌన్లోడ్ చేసి ప్రారంభించండి: WhatsApp Business యాప్ Google Play Store మరియు Apple App Storeలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ హోమ్ స్క్రీన్‌పై WhatsApp Business చిహ్నంపై ట్యాప్ చేయండి.
3. సేవా నిబంధనలు సమీక్షించండి: WhatsApp Business సేవా నిబంధనలు చదివి ఆమోదించేందుకు, అంగీకరించి కొనసాగించు బటన్ ట్యాప్ చేయండి
4. రిజిస్టర్ చేయండి: WhatsApp Messengerలో మీరు ఉపయోగిస్తున్న నంబరును WhatsApp Business ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. కొనసాగేందుకు, మీ బిజినెస్ నంబరుతో ఉన్న ఆప్షన్ని ట్యాప్ చేయండి.
5. మీ అకౌంట్‌ను బదిలీ చేయండి: అకౌంట్ బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు WhatsApp Business యాప్‌ను తెరిచి ఉంచి, మీ ఫోన్ ఆన్ చేయబడి ఉండేలా చూడండి. బదిలీ ఆటోమేటిక్‌గా జరుగుతుండగా, మీ బ్యాకప్ నుండి రీస్టోర్ చేసుకోమని మీకు మెసేజ్ రావచ్చు. కొనసాగించు లేదా పునరుద్ధరించు ట్యాప్ చేయండి. ఆపై, ప్రాంప్ట్ చేయబడితే తర్వాత ట్యాప్ చేయండి.
6. కాంటాక్ట్‌లు మరియు ఫోటోలకు యాక్సెస్ అనుమతినివ్వండి: మీ ఫోన్ యొక్క అడ్రస్ బుక్ నుండి కాంటాక్ట్‌లు WhatsApp Business యాప్‌నకు యాడ్ చేయవచ్చు. మీ ఫోటోలు, వీడియోలు, మరియు ఫైళ్లకు కూడా మీరు యాక్సెస్‌ను అనుమతించవచ్చు.
7. అకౌంట్ సృష్టించండి: మీ బిజినెస్ పేరును నింపి, బిజినెస్ కేటగిరీ ఎంపిక చేసుకుని, ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోండి.
8. మీ బిజినెస్ ప్రొఫైల్ రూపొందించండి:అన్వేషించండిలోకి వెళ్లి > బిజినెస్ ప్రొఫైల్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు, మీ బిజినెస్ అడ్రెస్, వివరాలు, పని వేళలు లాంటి మరిన్ని ముఖ్యమైన బిజినెస్ సమాచారాన్ని యాడ్ చేయవచ్చు.
9. చాట్ ప్రారంభించండి. మీ బిజినెస్ ప్రొఫైల్ ఇప్పుడు సెటప్ చేయబడింది. లేదా ట్యాప్ చేసి, ఆపై మెసేజ్ పంపడానికి కాంటాక్ట్‌ను శోధించండి లేదా ఎంచుకోండి. టెక్స్ట్ ఫీల్డ్‌లో మెసేజ్ నమోదు చేయండి. తర్వాత, లేదా ట్యాప్ చేయండి.
మీ వ్యాపారాన్ని సమర్దవంతంగా నిర్వహించుకోవడంలో సహాయపడేందుకు WhatsApp Business యాప్‌లో పలు టూల్స్ లభిస్తాయి. ఈ టూల్స్‌ను విశ్లేషించడానికి, మీ చాట్స్ స్క్రీన్కు వెళ్లండి. Androidలో మరిన్ని ఎంపికలు లేదా iPhoneలో సెట్టింగ్‌లు ట్యాప్ చేయండి. తర్వాత, బిజినెస్ టూల్స్ ట్యాప్ చేయండి.