చివరిగా అప్‌డేట్ చేసినది: 16 ఫిబ్రవరి, 2024
WhatsApp ఛానెల్‌లు అనేది ప్రైవేట్ మెసేజింగ్ నుండి వేరుగా ఉండడంతో పాటు వ్యక్తులు తమకు ముఖ్యమైన వ్యక్తులు మరియు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని ఫాలో కావడంలో సహాయపడేందుకు రూపొందించబడిన WhatsAppలోని ఒక ఐచ్ఛిక, వన్-వే బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్. తమ అప్‌డేట్‌లు సాధారణ ఆడియన్స్‌కి తగిన విధంగా ఉండేలా చూసుకునేందుకు ఛానెల్ అడ్మిన్‌లు క్రింది మార్గదర్శకాల (ఈ “ఛానెల్‌ల మార్గదర్శకాల”)ను గుర్తుంచుకోవలసి ఉంటుంది. WhatsApp ఛానెల్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ ఛానెల్‌ల మార్గదర్శకాలకు మరియు మా WhatsApp ఛానెల్‌ల కోసం అనుబంధ సేవా నిబంధనలకు అంగీకరిస్తున్నారు.
గ్రహీతలు వారి ఛానెల్‌ని ఫాలో కావడాన్ని నిలిపివేయకుండా ఉండేందుకు, ఛానెల్ అడ్మిన్‌లు తమ ఫాలోవర్‌ల పట్ల గౌరవంగా ఉండడంతో పాటు చాలా ఎక్కువ సంఖ్యలో లేదా తక్కువ-నాణ్యతతో కూడిన అప్‌డేట్‌లను పంపకుండా నివారించాల్సి ఉంటుంది. ఛానెల్ అడ్మిన్‌లు తమ ఛానెల్‌కు ఛానెల్ కంటెంట్‌ను ప్రతిబింబించే శీర్షికను అందించడంతో పాటు వినియోగదారులు తాము ఏ ఛానెల్‌లను ఫాలో కావాలని ఎంచుకుంటారో తెలియజేసే ఎంపికలను చేయడంలో సహాయపడుతుంది.
ఛానెల్‌ల మార్గదర్శకాలలోని క్రింది వాటిని ఉల్లంఘించే ఛానెల్‌లపై WhatsApp చర్య తీసుకోవచ్చు:
ఈ ఛానెల్‌ల మార్గదర్శకాల దుర్వినియోగాన్ని గుర్తించడానికి WhatsApp ఆటోమేటిక్ చేయబడిన టూల్‌లు, మానవ సమీక్ష మరియు వినియోగదారు నివేదికలను ఉపయోగించి చర్య తీసుకోవచ్చు. ఛానెల్‌లకు సంబంధించిన ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న ఛానెల్‌లోని ఏదైనా ఛానెల్ లేదా నిర్దిష్ట అప్‌డేట్‌లను నివేదించవలసిందిగా మేము వినియోగదారులను ప్రోత్సహిస్తాము. WhatsAppలో ఛానెల్‌ని నివేదించడానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోగలరు. సంభవనీయ మేధో సంపత్తి ఉల్లంఘనలను నివేదించే విధానానికి సంబంధించిన సమాచారం కోసం, దయచేసి ఇక్కడ చూడండి.
ఆటోమేటిక్‌గా చేయబడే ప్రాసెసింగ్
ఆటోమేటిక్ చేయబడిన డేటా ప్రాసెసింగ్ అనేది మా సమీక్ష ప్రక్రియలో ప్రధానమైనదిగా ఉండడంతో పాటు ఛానెల్‌ల కంటెంట్ ఛానెల్‌లకు సంబంధించిన ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతాలలో ఆటోమేటిక్‌గా నిర్ణయాలను అమలు చేస్తుంది.
ఉల్లంఘించే అవకాశమున్న ఛానెల్‌లలోని కంటెంట్‌ను సరైన పరిజ్ఞానం మరియు భాషా నైపుణ్యం ఉన్న మానవ సమీక్షకులకు మళ్లించడం ద్వారా సమీక్షకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఆటోమేషన్ మాకు సహాయపడుతుంది, తద్వారా మా బృందాలు ముందుగా అత్యంత ముఖ్యమైన కేసులపై దృష్టి పెట్టవచ్చు.
మానవ సమీక్ష బృందాలు
ఛానెల్‌కు తదుపరి సమీక్ష అవసరమైనప్పుడు, తుది నిర్ణయం తీసుకోవడానికి మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు దానిని మానవ సమీక్షా బృందానికి పంపుతాయి. మా మానవ సమీక్షా బృందాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటిలోని సభ్యులు క్షుణ్ణమైన శిక్షణ పొందడంతో పాటు తరచుగా నిర్దిష్ట విధాన ప్రదేశాలు మరియు ప్రాంతాలలో ప్రత్యేకతను కలిగి ఉంటారు. మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు ప్రతి నిర్ణయం నుండి నేర్చుకోవడంతో పాటు వాటి నుండి తమను తాము మెరుగుపర్చుకుంటాయి.
స్థానిక చట్టాల ఉల్లంఘనలు
మేము పని చేసే దేశాలలోని అధికారుల నుండి చెల్లుబాటయ్యే చట్టపరమైన ఆదేశాలను WhatsApp సమీక్షించి, ప్రతిస్పందిస్తుంది. WhatsApp ఛానెల్‌లను పరిమితం చేయవలసిందిగా మేము కోర్టు నుండి ఉత్తర్వులను కూడా అందుకోవచ్చు. ఏదైనా చర్యను తీసుకోవడానికి ముందు మేము ప్రభుత్వ అభ్యర్థన యొక్క చట్టబద్ధత మరియు సంపూర్ణతను ఎల్లప్పుడూ అంచనా వేస్తాము.
మేము చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘనను గుర్తించినప్పుడు, మేము క్రింది వాటితో సహా కంటెంట్ లేదా ఉల్లంఘన యొక్క స్వభావాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు:
అడ్మిన్(లు) చట్టవిరుద్ధమైన కంటెంట్‌తో సహా మా నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించే కంటెంట్‌ను పదే పదే పోస్ట్ చేసినట్లయితే, WhatsApp ఛానెల్‌లను తాత్కాలికంగా తొలగిస్తుంది. ఛానెల్‌ని తాత్కాలికంగా తొలగించడం అనే నిర్ణయం ఉల్లంఘిస్తున్న కంటెంట్ మొత్తం, దాని స్వభావం మరియు తీవ్రత అలాగే గుర్తించగలిగినట్లయితే, వినియోగదారు ఉద్దేశ్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
WhatsApp ఛానెల్‌ల కోసం అనుబంధ సేవా నిబంధనలలో ప్రతిబింబించే విధంగా మేము అదనపు చర్యలు తీసుకోవచ్చు.
ఛానెల్‌ల అదుపు: ఎగువన వివరించిన విధంగా, ఏవైనా ఛానెల్‌లు ఈ ఛానెల్‌ల మార్గదర్శకాలతో సహా మా నిబంధనలు లేదా విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని మేము నిర్ధారించినప్పుడు మేము ఆ ఛానెల్‌లపై చర్య తీసుకోవచ్చు. మేము తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవించనట్లయితే, మీరు మీ ఛానెల్‌ల సమాచార పేజీ నుండి ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేయవచ్చు. మీరు ఇక్కడ WhatsApp మద్దతు విభాగం ద్వారా అప్పీల్‌ను కూడా సబ్‌మిట్ చేయగలరు. మా నిర్ణయం తప్పు అని మేము నిర్ధారించుకున్నట్లయితే, మేము అమలును రివర్స్ చేస్తాము.
అకౌంట్ నిలిపివేయబడడం: ఈ ఛానెల్‌ల మార్గదర్శకాలు లేదా సేవా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మేము మీ అకౌంట్‌ను నిలిపివేసినట్లయితే, ఇక్కడ వివరించిన విధంగా మీరు ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేసుకోవచ్చు.
ఛానెల్‌లపై మేము తీసుకున్న కంటెంట్ నిర్ణయంతో మీరు ఏకీభవించకున్నా అలాగే మీరు EU వినియోగదారు అయినా, సమస్యను పరిష్కరించుకునేందుకుగానూ మీరు కోర్టుకి వెలుపల వివాదాల పరిష్కారాల కోసం ధృవీకరించబడిన ఏదైనా సంస్థతో ఆ నిర్ణయాన్ని తీసుకోవచ్చు.
వినియోగదారు నివేదికలు: మీరు ఇతరులు పోస్ట్ చేసిన ఏదైనా కంటెంట్‌ను రిపోర్ట్ చేసినప్పటికీ, సదరు కంటెంట్ మా నిబంధనలు లేదా విధానాలకు విరుద్ధంగా లేదని మేము కనుగొన్నట్లయితే, మేము మీకు తెలియజేస్తాము. మేము తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవించనట్లయితే, మీరు ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేయవచ్చు. మా నిర్ణయం తప్పు అని మేము నిర్ధారించుకున్నట్లయితే, మేము అమలును రివర్స్ చేస్తాము.