మీరు WhatsApp ఛానెల్‌ల (“ఛానెల్‌ల”)ను ఉపయోగిస్తున్నప్పుడు మా సమాచార పద్ధతులను వివరించడంలో ఈ WhatsApp ఛానెల్‌ల అనుబంధ గోప్యతా విధానం సహాయపడుతుంది. మేము “WhatsApp”, “మా”, “మేము” లేదా “మాకు” అని చెప్పడం ద్వారా మేము WhatsApp LLCని సూచిస్తాము.
ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం అనేది ఛానెల్‌లతో పాటు మా అన్ని సేవల వినియోగానికి వర్తించే WhatsApp గోప్యత విధానానికి అనుబంధంగా ఉంటుంది. ఈ ఛానెల్‌ల గోప్యతా విధానంలో ఉపయోగించబడినప్పటికీ, నిర్వచించబడని ఏవైనా క్యాపిటలైజ్ చేయబడిన పదాలు WhatsApp గోప్యతా విధానంలో నిర్వచించబడిన అర్థాలను కలిగి ఉంటాయి. ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం మరియు WhatsApp గోప్యతా విధానం మధ్య ఏదైనా వైరుధ్యం ఉన్నట్లయితే, మీ ఛానెల్‌ల వినియోగానికి సంబంధించి అలాగే వైరుధ్యం ఉన్నంత మేరకు మాత్రమే ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం నియంత్రిస్తుంది.
WhatsApp ఛానెల్‌లకు అనుబంధ సేవా నిబంధనలు మరియు WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలు మీ ఛానెల్‌ల వినియోగానికి వర్తిస్తాయి.
ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం వేటిని కవర్ చేస్తుంది?
ఛానెల్‌లు అనేది WhatsAppలోని ఒక ఐచ్ఛికమైన, వన్-వే బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్, ఇది మా ప్రైవేట్ మెసేజింగ్ సేవల నుండి వేరుగా ఉంటూ (మిమ్మల్ని ఛానెల్ “అడ్మిన్”గా చేస్తూ) ఛానెల్‌ని సృష్టించగలిగేలా మిమ్మల్ని అనుమతిస్తుంది అక్కడ మీరు ఇతరులు వీక్షించేలా అప్‌డేట్‌ల (“ఛానెల్ కంటెంట్”)ను షేర్ చేయగలరు. మీరు ఛానెల్ కంటెంట్‌ను వీక్షించడం మరియు దానితో ఇంటరాక్ట్ కావడం వంటివి చేయగలగడంతో పాటు నిర్దిష్ట ఛానెల్‌లను ఫాలోవర్ (“ఫాలోవర్”)గా అనుసరించగలరు. ఫాలోవర్‌లు కాని వ్యక్తులు (“వీక్షకులు”) కూడా ఛానెల్ కంటెంట్‌ను వీక్షించడం మరియు దానితో ఇంటరాక్ట్ కావడం వంటివి చేయగలరు.
ఛానెల్‌లు పబ్లిక్‌గా ఉంటాయి, అంటే మీ ఛానెల్‌ని కనుగొనడం, ఫాలో కావడం మరియు వీక్షించడం వంటివి ఎవరైనా చేయగలరు. ఛానెల్‌ల పబ్లిక్ స్వభావం మరియు అపరిమిత ప్రేక్షకుల పరిమాణం వంటి వాటిని బట్టి, ఛానెల్ కంటెంట్ ఏ వినియోగదారుకైనా, WhatsApp ద్వారా కనిపిస్తుంది. ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం, అనుబంధ నిబంధనలు మరియు WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలలలో మరింతగా వివరించిన విధంగా, ఛానెల్‌లలో సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి WhatsApp సేకరించి, ఉపయోగించే సమాచారంలో ఛానెల్ కంటెంట్ కూడా ఉంటుంది అని దీని అర్థం.
ముఖ్యంగా, WhatsApp ఛానెల్‌లకు సంబంధించిన మీ ఉపయోగం మీ WhatsApp వ్యక్తిగత సందేశాల గోప్యతను ప్రభావితం చేయదు, ఇది WhatsApp గోప్యతా విధానంలో వివరించిన విధంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండడం కొనసాగుతుంది.
భవిష్యత్తులో, ఛానెల్‌లు మరియు ఛానెల్ కంటెంట్ కోసం శోధించడానికి కొత్త మార్గాలు, ఛానెల్‌ల కోసం అదనపు ఆడియన్స్ మరియు గోప్యతా సెట్టింగ్‌లు మరియు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన ఛానెల్‌ల వంటి ఛానెల్‌లకు సంబంధించిన అదనపు ఫీచర్‌లను మేము పరిచయం చేయవచ్చు. మేము ఫీచర్‌లు మరియు సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసినప్పుడు మీరు ఇప్పటికే ఛానెల్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, సముచితమైన ఫీచర్‌ల గురించి మేము మీకు తెలియజేస్తాము.
మేము సేకరించే సమాచారం
మా సేవలలో మేము సేకరించే సమాచారాన్ని WhatsApp గోప్యత విధానం వివరిస్తుంది. మీరు ఛానెల్‌లను ఉపయోగించినప్పుడు, మేము వీటిని కూడా సేకరిస్తాము:
ఛానెల్ అడ్మిన్‌ల నుండి మరియు వారికి సంబంధించిన సమాచారం
- ఛానెల్ సృష్టించడానికి సమాచారం. ఒక ఛానెల్‌ని సృష్టించడానికి, అడ్మిన్‌లు ఛానెల్ పేరు వంటి వాటితో కూడిన ప్రాథమిక సమాచారాన్ని తప్పనిసరిగా అందించవలసి ఉంటుంది. అడ్మిన్‌లు ప్రత్యేకమైన ఛానెల్ అడ్మిన్ పేరు, చిహ్నం, చిత్రం, వివరణ లేదా మూడవ పక్షం సైట్‌లకు లింక్‌లు వంటి ఇతర సమాచారాన్ని జోడించడాన్ని కూడా ఎంచుకోవచ్చు.
- ఛానెల్ అప్‌డేట్‌లు. ఛానెల్‌లు పబ్లిక్‌గా ఉంటాయి, కాబట్టి అడ్మిన్‌లు సృష్టించే లేదా షేర్ చేసే టెక్స్ట్, వీడియోలు, ఫోటోలు, చిత్రాలు, డాక్యుమెంట్‌లు, లింక్‌లు, GIFలు, స్టిక్కర్‌లు, ఆడియో కంటెంట్ లేదా ఇతరులు వీక్షించేలా వారి ఛానెల్ అప్డేట్లలోని ఇతర రకాల కంటెంట్ వంటి ఛానెల్ కంటెంట్‌ను మేము సేకరిస్తాము.
వీక్షకులు మరియు ఫాలోవర్ సమాచారం
- ఫాలోవర్‌లు, వీక్షకులు మరియు ఇతర కనెక్షన్‌లు. మేము ఫాలోవర్‌లు మరియు వీక్షకులకు సంబంధించి వారి ప్రతిచర్యలు, భాష ఎంపికలు మరియు వారు ఫాలో చేసే ఛానెల్‌ల వంటి సమాచారాన్ని సేకరిస్తాము.
ఛానెల్‌ల వినియోగదారులు అందరికీ సంబంధించిన సమాచారం
- వినియోగ మరియు లాగ్ సమాచారం. సేవ-సంబంధిత, విశ్లేషణాత్మక మరియు పనితీరు సమాచారం లాంటి ఛానెల్‌లలో మీ కార్యకలాపానికి సంబంధించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. మీరు ఛానెల్‌లను ఉపయోగించినప్పుడు, మీరు వీక్షించే కంటెంట్ రకాలు మరియు వాటితో మీరు ఇంటరాక్ట్ చేసే విధానంతో సహా ఛానెల్‌లలో మీ కార్యాచరణ మరియు వినియోగం; ఛానెల్‌లు, ఛానెల్ కంటెంట్ మరియు ఫాలోవర్‌లు మరియు వీక్షకుల ప్రతిస్పందనల గురించిన మెటాడేటా; మీరు ఉపయోగించే ఛానెల్‌ల ఫీచర్‌లు మరియు మీరు వాటిని ఉపయోగించే విధానం మరియు ఛానెల్‌లలో మీ కార్యకలాపాల సమయం, ఫ్రీక్వెన్సీ మరియు వ్యవధి వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము.
- వినియోగదారు నివేదికలు. వినియోగదారులు లేదా మూడవ పక్షాలకు చెందిన వారు మీ ఛానెల్ లేదా నిర్దిష్ట ఛానెల్‌కు సంబంధించిన - ఉదాహరణకు, మా నిబంధనలు లేదా విధానాలు లేదా స్థానిక చట్టాల ఉల్లంఘనలను నివేదించడం వంటి కంటెంట్‌ను మాకు నివేదించవచ్చు. ఒక నివేదిక రూపొందించబడినప్పుడు, మేము నివేదించిన పక్షం మరియు నివేదించిన వినియోగదారు(ల) (ఉదా. ఛానెల్ అడ్మిన్)కి సంబంధించిన సమాచారాన్ని అలాగే సంబంధిత ఛానెల్‌లు లేదా ఛానెల్ కంటెంట్, వినియోగదారు ఇంటరాక్షన్‌లు మరియు ఛానెల్‌లలో కార్యకలాపం వంటి నివేదికను పరిశోధించడంలో మాకు సహాయపడే ఇతర సమాచారం మరియు ఛానెల్‌ను మ్యూట్ చేసిన ఫాలోవర్‌ల సంఖ్య మరియు ఇతర వినియోగదారు నివేదికలు లేదా అమలు చర్యలు వంటి ఇతర సమాచారాన్ని సేకరిస్తాము. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మా WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలు మరియు అధునాతన సురక్షత మరియు భద్రత ఫీచర్‌లను చూడండి.
సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము
మేము సేకరించే సమాచారాన్ని క్రింది అదనపు మార్గాలలో ఉపయోగిస్తాము:
- ఛానెల్‌లను అందించండి. ఛానెల్‌లను నిర్వహించడం, అందించడం మరియు మెరుగుపరచడం వంటివి చేయడానికి మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ఛానెల్‌లను సృష్టించడం, ఫాలో కావడం లేదా ఇంటరాక్ట్ కావడం వంటివి చేయడానికి, అదనపు ఛానెల్‌ల ఫీచర్‌లను అందించడంలో లేదా అభివృద్ధి చేయడంలో మాకు సహాయం చేయడానికి లేదా మీ దేశం లేదా స్థానిక భాషలో ఉన్న ఛానెల్‌లను చూపించడం లేదా మీకు సిఫార్సు చేయడం వంటి ఛానెల్‌లకు సంబంధించిన మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
- ఛానెల్‌ల వినియోగాన్ని అర్థం చేసుకోవడం. ఛానెల్‌ల ప్రభావం, పనితీరు, విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మరియు విశ్లేషించడానికి, వ్యక్తులు ఛానెల్‌లను వినియోగించే మరియు ఇంటరాక్ట్ అయ్యే విధానం గురించి అర్థం చేసుకోవడానికి అలాగే మేము మా సేవలను అభివృద్ధి చేసి, మెరుగుపరచగలిగే విధానాన్ని నిర్ణయించడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము.
- సురక్షత, భద్రత మరియు సమగ్రత కోసం. హానికరమైన ప్రవర్తనను ఎదుర్కోవడంతో సహా మా సేవలలో సురక్షత, భద్రత మరియు సమగ్రతను నిర్ధారించుకోవడానికి (ఛానెల్ కంటెంట్ మరియు ఛానెల్‌లలో మీ కార్యాచరణతో సహా) మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము; చెడు లేదా హానికరమైన అనుభవాల నుండి వినియోగదారులను రక్షించడం, మా WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలతో సహా అనుమానాస్పద కార్యాచరణ లేదా మా నిబంధనలు మరియు విధానాలకు సంబంధించిన ఉల్లంఘనలను గుర్తించి, పరిశోధించడం అలాగే ఛానెల్‌లతో పాటుగా మా సేవలు చట్టబద్ధంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాము.
సమాచారం ఎలా షేర్ చేయబడుతుంది
ఛానెల్‌ల సమాచారం క్రింది మార్గాల్లో షేర్ చేయబడుతుంది:
- పబ్లిక్ సమాచారం. ఛానెల్ కంటెంట్ మరియు ఛానెల్‌లలో అడ్మిన్‌లు షేర్ చేసే సమాచారం ఎవరైనా ఆడియన్స్ లేదా గోప్యతా సెట్టింగ్‌లకు లోబడి పబ్లిక్ మరియు ఇతరులకు అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. ఎవరైనా స్క్రీన్‌షాట్‌లను క్యాప్చర్ చేయవచ్చని లేదా ఛానెల్ కంటెంట్ మరియు ఛానెల్‌లలో ఇంటరాక్షన్‌లను రికార్డింగ్ చేయగలరని అలాగే వాటిని WhatsApp లేదా ఇతరులు ఎవరికైనా పంపవచ్చునని లేదా వాటిని మా సేవల నుండి షేర్ చేయడం, ఎగుమతి చేయడంలేదా అప్‌లోడ్ చేయడం వంటివి చేయవచ్చునని మీరు గుర్తుంచుకోవలసి ఉంటుంది.
- మూడవ పక్షం సేవా ప్రొవైడర్‌లు మరియు Meta కంపెనీలు. మా ఛానెల్‌లను నిర్వహించడం, అందించడం, మెరుగుపరచడం, అర్థం చేసుకోవడం మరియు వాటికి మద్దతు అందజేయడంలో మాకు సహాయంగా మేము మూడవ పక్షం సేవా ప్రొవైడర్‌లు మరియు ఇతర Meta కంపెనీలతో కలిసి పని చేస్తాము. వర్గీకరణలు, కంటెంట్ మరియు ప్రవర్తనా సంకేతాలు, మానవ సమీక్ష మరియు వినియోగదారు నివేదికల సమ్మేళనాన్ని ప్రభావితం చేసే గుర్తింపు మరియు కొలత సాధనాల వినియోగంతో సహా—ఉల్లంఘించే కంటెంట్ లేదా ఛానెల్‌ల వినియోగాన్ని ముందస్తుగా మరియు క్రియాశీలంగా గుర్తించడంతో సహా ఛానెల్‌లు మరియు మా సేవలపై సురక్షత, భద్రత మరియు సమగ్రతను ప్రోత్సహించడంలో మాకు సహాయపడటానికి మేము Meta కంపెనీలతో కూడా కలిసి పని చేస్తాము. ఈ సామర్థ్యం మేరకు మూడవ-పక్షం సేవా ప్రదాతలతో మరియు ఇతర Meta కంపెనీలతో మేము సమాచారాన్ని షేర్ చేసినప్పుడు, మా సూచనలు మరియు నిబంధనలకు అనుగుణంగా మా తరఫున మీ సమాచారాన్ని ఉపయోగించాలని వారిని మేము కోరతాము.
మీ సమాచారాన్ని నిర్వహించడం మరియు నిలిపి ఉంచుకోవడం
WhatsApp గోప్యత విధానంలో పేర్కొన్న మా యాప్‌లోని సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ఛానెల్‌ల సమాచారాన్ని యాక్సెస్ చేయడం, నిర్వహించడం లేదా పోర్ట్ చేయడం వంటివి చేయవచ్చు.
- మీ పబ్లిక్ ఛానెల్ కంటెంట్‌ను మరియు ఛానెల్ సమాచారాన్ని నిలిపి ఉంచుకోవడం. ఛానెల్‌లను అందించే సాధారణ కోర్సులో, మేము ఛానెల్ కంటెంట్‌ను గరిష్టంగా 30 రోజుల వరకు, దాని సురక్షత, భద్రత మరియు సమగ్రత ప్రయోజనాలకు లేదా ఎక్కువ కాలం నిలుపుదలకు అవసరమయ్యే ఇతర చట్టపరమైన లేదా సమ్మతి బాధ్యతలకు లోబడి మా సర్వర్‌లలో నిల్వ చేస్తాము. మేము ఛానెల్ కంటెంట్ వేగంగా ఉదాహరణకు 7 రోజులు లేదా 24 గంటల తర్వాత అదృశ్యం అయ్యేలా అడ్మిన్‌లు ఎంపికలను అందించినప్పటికీ ఛానెల్ కంటెంట్ వీక్షకుల లేదా ఫాలోవర్‌ల పరికరాలలో ఎక్కువ కాలం పాటు ఉండవచ్చు. ఛానెల్‌లను అందించడం లేదా చట్టబద్ధమైన బాధ్యతలను అనుసరించడం, మా నిబంధనలు మరియు విధానాలను అమలు చేయడం మరియు ఉల్లంఘనలను నిరోధించడం లేదా మా హక్కులు, ఆస్తి మరియు వినియోగదారులను రక్షించుకోవడం మరియు కాపాడుకోవడంతో సహా, ఈ ఛానెల్‌ల గోప్యతా విధానం మరియు WhatsApp గోప్యత విధానంలో గుర్తించబడిన ప్రయోజనాల కోసం, అవసరమైనంత కాలం మేము ఇతర ఛానెల్‌ల సమాచారాన్ని నిల్వ చేస్తాము. నిల్వ వ్యవధులు అనేవి సమాచార స్వభావం, అది ఎందుకు సేకరించబడింది మరియు ప్రాసెస్ చేయబడింది, సంబంధిత చట్టబద్ధమైన లేదా నిర్వాహక నిలుపుదల అవసరాలు మరియు చట్టబద్ధ అభ్యంతరాల వంటి కారకాల మీద ఆధారపడేటటువంటి కేస్ల వారీ ప్రాతిపదికన నిర్ణయించబడతాయి.
- మీ ఛానెల్‌ని తొలగించడం. మీరు అడ్మిన్ అయినట్లయితే, మీ ఛానెల్‌ని తొలగించడం వలన మీ యాప్‌లోని ఛానెల్‌ల ట్యాబ్ నుండి ఛానెల్ మరియు ఛానెల్ కంటెంట్ తీసివేయబడుతుంది, ఆ సమయంలో ఛానెల్‌ల ద్వారా ఇతర వినియోగదారులకు ఇది యాక్సెస్ చేయబడదు. మా సర్వర్‌లలోని మీ ఛానెల్‌ల సమాచారాన్ని తొలగించడానికి గరిష్టంగా 90 రోజుల సమయం పట్టవచ్చు. చట్టబద్ధమైన బాధ్యతలను పాటించడం, మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘనలు లేదా హానిని నిరోధించే ప్రయత్నాల వంటి వాటి కోసం మేము మీ సమాచారాన్ని కొంత భాగాన్ని కూడా కలిగి ఉండవచ్చు. మీరు మీ ఛానెల్‌ని తొలగించినప్పుడు, ఇతర వినియోగదారులు వారి పరికరంలో స్థానికంగా సేవ్ చేసుకున్న లేదా ఇతర వినియోగదారులకు ఫార్వార్డ్ చేయబడిన లేదా మా సేవల నుండి షేర్ చేయబడిన ఛానెల్ కంటెంట్ కాపీ వంటి ఛానెల్ సమాచారం మరియు కంటెంట్‌ను ప్రభావితం కాదని దయచేసి గుర్తుంచుకోండి.
- ఛానెల్ కంటెంట్‌ని తీసివేయడం. ఛానెల్ అడ్మిన్‌లు ఛానెల్లో పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్‌ను గరిష్టంగా తదుపరి 30 రోజులలోపు తీసివేయగలరు.
మా డేటా తొలగింపు మరియు నిలిపి ఉంచుకోవడం వంటి వాటికి సంబంధించిన పద్ధతులు మరియు మీ ఖాతాను తొలగించే విధానం వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
మా విధానానికి అప్‌డేట్‌లు
మేము ఈ ఛానెల్‌ల గోప్యతా విధానానికి సవరణలు లేదా అప్‌డేట్‌లు చేయవచ్చు. మేము చేసిన సవరణలు లేదా అప్‌డేట్‌లకు సంబంధించి, సముచితమైన రీతిలో మేము మీకు నోటీసు అందించడంతో పాటు పైభాగంలో అమలులోకి వచ్చిన తేదీని అప్‌డేట్ చేస్తాము. దయచేసి, మా ఛానెల్‌ల గోప్యతా విధానాన్ని కాలానుగుణంగా సమీక్షించండి.