అమలులోకి వచ్చే తేదీ: 25 మే, 2023
WhatsApp ద్వారా మీకు అందించబడే “సేవలలో” WhatsApp ఛానెల్‌లు ఒకటి. ఛానెల్‌ల కోసం ఈ అనుబంధ సేవా నిబంధనలు (“అనుబంధ నిబంధనలు”) WhatsApp సేవా నిబంధనలకు అనుబంధంగా ఉండడంతో పాటు మీ ఛానెల్‌ల వినియోగానికి కూడా వర్తిస్తాయి. అనుబంధ నిబంధనల యొక్క నిబంధనలు మరియు షరతులు మీ ఛానెల్‌ల వినియోగానికి ప్రాధాన్యమైనవిగా ఉండడంతో పాటు వర్తిస్తాయి. ఈ అనుబంధ నిబంధనలలో ఏదీ WhatsApp సేవా నిబంధనల ప్రకారం లేదా వారు సూచించే ఏవైనా అదనపు నిబంధనలు లేదా విధానాల ప్రకారం మా హక్కులను పరిమితం చేయదు.
WhatsApp ఛానెల్‌ల గోప్యత విధానం అనేది WhatsApp గోప్యత విధానానికి అనుబంధంగా ఉండడంతో పాటు మీరు ఛానెల్‌లను ఉపయోగించినప్పుడు మేము సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం మరియు షేర్ చేయడం వంటివి ఎలా చేస్తాము అని వివరిస్తుంది. మీ గోప్యతా ఎంపికలను సమీక్షించడానికి మీరు ఎప్పుడైనా మీ సెట్టింగ్‌లకు కూడా వెళ్లవచ్చు. ఛానెల్‌లకు సంబంధించిన మీ వినియోగం మీ వ్యక్తిగత WhatsApp సందేశాల గోప్యతను ప్రభావితం చేయదు, ఇది WhatsApp గోప్యతా విధానంలో వివరించిన విధంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండడం కొనసాగుతుంది.
ఛానెల్‌లు అనేది ఇతర WhatsApp వినియోగదారులు షేర్ చేసిన సంబంధితమైన మరియు సమయానుకూలమైన అప్‌డేట్‌లను వీక్షించడానికి మరియు ఇంటరాక్ట్ కావడానికి మిమ్మల్ని అనుమతించే ఒకరి నుండి అనేక మందికి అందజేయబడే ప్రసార సేవ. మీరు అప్‌డేట్‌లను షేర్ చేయడానికి ఛానెల్‌ని సృష్టించవచ్చు, దానిని కనుగొనడం, ఫాలో కావడం మరియు వీక్షించడం వంటివి ఎవరైనా చేయగలరు. మీరు ఛానెల్‌లలో షేర్ చేసే కంటెంట్ WhatsApp మరియు మా వినియోగదారులకు కనిపిస్తుంది. మీ దేశం లేదా స్థానిక భాష ఆధారంగా మీరు ఫాలో కావాలనే ఆసక్తి కలిగి ఉండే అవకాశమున్న ఛానెల్‌లను కూడా మేము జాబితా చేయవచ్చు.
ఛానెల్‌లను మీరు తప్పనిసరిగా చట్టబద్ధమైన, అధీకృతమైన మరియు ఆమోదయోగ్యమైన ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. వారి ఛానెల్లలోని కంటెంట్‌కు ఛానెల్ అడ్మిన్‌లు బాధ్యత వహించడంతో పాటు వారి ఫాలోవర్‌లకు వయస్సుకి-తగిన విధమైన మరియు సురక్షితమైన అనుభవాన్ని అందించాల్సి ఉంటుంది. ఛానెల్‌లలో వినియోగదారులు చేసే లేదా చెప్పే వాటిని మేము నియంత్రించము అలాగే వారి (లేదా మీ) చర్యలు లేదా (ఆన్‌లైన్‌లోని లేదా ఆఫ్‌లైన్‌లోని) ప్రవర్తన లేదా (చట్టవిరుద్ధమైన లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌తో సహా) కంటెంట్‌కి మేము బాధ్యత వహించము.
ఛానెల్ అడ్మిన్‌లు ఈ అనుబంధ నిబంధనలు లేదా WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలతో సహా మీ వినియోగంతో పాటు వాటికి మాత్రమే పరిమితం కాకుండా మా సేవలకు వర్తించే ఇతర నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించే కార్యకలాపంలో పాల్గొనరాదు. ఇందులో ఇవి ఉంటాయి:
WhatsApp వినియోగదారులు తమ హక్కులు లేదా మా నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న ఏదైనా ఛానెల్ లేదా నిర్దిష్ట అప్‌డేట్‌ని నివేదించవచ్చు. WhatsAppలో నివేదించడం మరియు బ్లాక్ చేయడం వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
WhatsApp సేవా నిబంధనలు, ఈ అనుబంధ నిబంధనలు, మా (WhatsApp ఛానెల్‌ల మార్గదర్శకాలతో కూడిన) విధానాలు లేదా చట్ట ప్రకారం మేము అనుమతించబడిన లేదా చేయవలసి ఉన్న చోట వాటిని ఉల్లంఘించేలా ఛానెల్‌లలో షేర్ చేయబడిన ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని WhatsApp తీసివేయడం, భాగస్వామ్యాన్ని నిరోధించడం లేదా యాక్సెస్‌ని పరిమితం చేయడం చేయవచ్చు. మేము నిర్దిష్ట ఫీచర్‌లకు యాక్సెస్‌ను తీసివేయడం లేదా పరిమితం చేయడం, ఒక ఖాతాను నిలిపివేయడం లేదా తాత్కాలికంగా తొలగించడం లేదా మా సేవలను మరియు మా వినియోగదారులను రక్షించడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థను సంప్రదించవచ్చు. WhatsApp సేవా నిబంధనలు మరియు Whatsapp గోప్యతా విధానంలో వివరించిన విధంగా WhatsApp అంతటా సురక్షత, భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడానికి మేము Meta కంపెనీలతో కూడిన మూడవ పక్ష సేవా ప్రొవైడర్‌లతో కలిసి పని చేయవచ్చు.
WhatsApp సేవా నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు, మొత్తం సేవకు మీ యాక్సెస్‌ను నిలిపివేసే హక్కును WhatsApp కలిగి ఉంటుంది. మేము మా విధానాలను అన్ని అధికార పరిధులలోనూ ఒకే విధంగా వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని అధికార పరిధులలో వర్తించే చట్టాల ప్రకారం వివిధ రకాల అమలు వర్తింపులకు సంబంధించిన నిర్దిష్ట అవసరాలు అవసరం కావచ్చు.
ఛానెల్‌లను అందించడానికి మాకు మీ నుండి నిర్దిష్ట అనుమతులు కావలసి ఉంటుంది. WhatsApp సేవా నిబంధనలలో మీరు మాకు మంజూరు చేసే లైసెన్స్(<WhatsAppకి మీ లైసెన్స్ >)లో మీరు WhatsApp ఛానెల్‌లలో షేర్ చేసే కంటెంట్ కలిపి ఉంటుంది.
ఛానెల్‌ల కార్యాచరణ మరియు/లేదా పనితీరు కాలక్రమేణా మారవచ్చు. మేము కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడం, పరిమితులను విధించడం, తాత్కాలికంగా తొలగించడం, తీసివేయడం, మార్చడం, యాక్సెస్‌ని పరిమితం చేయడం లేదా ఇప్పటికే ఉన్న నిర్దిష్ట ఫీచర్‌లు లేదా ఛానెల్‌లలో ఏదైనా భాగాన్ని అప్‌డేట్ చేయడం వంటివి చేయవచ్చు. మేము ఛానెల్‌ల యొక్క పరిమిత వెర్షన్‌లను అందించవచ్చు అలాగే ఈ వెర్షన్‌లు పరిమిత ఫీచర్‌లను కలిగి ఉండవచ్చు లేదా ఇతర పరిమితులను కలిగి ఉండవచ్చు. ఫీచర్ లేదా కంటెంట్ ఇకపై అందుబాటులో లేనట్లయితే, అటువంటి ఫీచర్ లేదా కంటెంట్‌కు సంబంధించి మీరు సృష్టించిన లేదా అందించిన సమాచారం, డేటా లేదా కంటెంట్ తొలగించబడవచ్చు లేదా యాక్సెస్ చేయలేకపోవచ్చు.
ఈ అనుబంధ నిబంధనలను మేము సవరించవచ్చు లేదా అప్‌డేట్ చేయవచ్చు. మా అనుబంధ నిబంధనలకు చేసిన ముఖ్యమైన సవరణలకు సంబంధించి, సముచితమైన రీతిలో మేము మీకు నోటీసు అందిస్తాము, మరియు మా అనుబంధ నిబంధనల పైభాగంలో "చివరగా సవరించిన" తేదీని అప్‌డేట్ చేస్తాము. ఛానెల్‌లను మీరు ఉపయోగించడం కొనసాగించడం అనేది మేము మా అనుబంధ నిబంధనలకు చేసిన సవరణలను మీరు అంగీకరించినట్లుగా నిర్ధారిస్తుంది. మీరు ఛానెల్‌లను ఉపయోగించడం కొనసాగిస్తారని మేము విశ్వసించినప్పటికీ, సవరించిన మా అనుబంధ నిబంధనలకు మీరు అంగీకరించనట్లయితే, మీ ఖాతాను తొలగించడం ద్వారా మీరు మా ఛానెల్‌లను ఉపయోగించడం లేదా మా సేవలను ఉపయోగించడం తప్పనిసరిగా ఆపివేయవలసి ఉంటుంది.