కంటెంట్ల పట్టిక
WhatsApp LLC (మీరు యు.కెలో లేదాయూరోపియన్ ప్రాంతం బయట నివసిస్తున్నట్లయితే) మరియు WhatsApp Ireland Limited (మీరు యూరోపియన్ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే) (సమగ్రంగా "WhatsApp," "మా," "మేము" లేదా "మాకు") అనేది వ్యక్తులు మరియు సంస్థలు తమ మేధోసంపత్తి హక్కులను కాపాడుకోవడంలో సహాయపడాలనే నిబద్ధతతో పని చేస్తోంది. మా యాప్‌లు, సేవలు, ఫీచర్లు, సాఫ్ట్వేర్, లేదా వెబ్సైట్ (అన్నీ కలిపి, "సేవలు") ఇన్స్టాల్ చేయడం, యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా మా వినియోగదారులు మా సేవా నిబంధనలకు ("నిబంధనలు") అంగీకరిస్తారు. మా సేవలను ఉపయోగించే సమయంలో మా వినియోగదారులు ఇతరుల కాపీరైట్లు మరియు ట్రేడ్‌మార్క్‌లతో సహా, వారి మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడానికి మా నిబంధనలు అనుమతించవు.
మా గోప్యతా విధానంలో మరింత వివరంగా వివరించినట్లు, మా సేవలను అందించే సాధారణ క్రమంలో మేము మా వినియోగదారుల మెసేజ్‌లను నిలిపి ఉంచుకోము. అయితే, మా వినియోగదారులు వారి అకౌంట్ సమాచారంలో వారి ప్రొఫైల్ చిత్రం, ప్రొఫైల్ పేరు లేదా పరిచయ మెసేజ్‌ను భాగం చేయాలని వారు నిర్ణయిస్తే, వాటితో సహా మా వినియోగదారుల అకౌంట్ సమాచారం, అలాగే ఛానెల్‌లలో కంటెంట్‌ను మేము హోస్ట్ చేస్తాము.
కాపీరైట్ అనేది కర్తృత్వం యొక్క అసలైన రచనలను (ఉదాహరణ: పుస్తకాలు, సంగీతం, చలనచిత్రం, కళ) రక్షించడానికి మద్దతిచ్చే చట్టపరమైన హక్కు. సాధారణంగా, కాపీరైట్ అనేది పదాలు లేదా చిత్రాల వంటి అసలైన వ్యక్తీకరణను రక్షిస్తుంది. ఇది వాస్తవాలు మరియు ఆలోచనలను రక్షించదు, అయినప్పటికీ ఇది ఆలోచనను వివరించడానికి ఉపయోగించే అసలైన పదాలు లేదా చిత్రాలను రక్షించవచ్చు. పేర్లు, టైటిల్లు మరియు నినాదాలు వంటి అంశాలను కూడా కాపీరైట్ రక్షించదు; అయితే, ట్రేడ్‌మార్క్ అని పిలువబడే మరొక చట్టపరమైన హక్కు వాటిని రక్షించవచ్చు.
WhatsAppలోని కంటెంట్ అనేది మీ కాపీరైట్ చేయబడిన పనిని ఉల్లంఘిస్తున్నట్లు మీరు విశ్వసిస్తే, కాంటాక్ట్ ఫారమ్‌ను పూరించడం ద్వారా మీరు దాన్ని రిపోర్ట్ చేయవచ్చు.
WhatsApp LLC
అటె.: WhatsApp కాపీరైట్ ఏజెంట్
1601 విల్లో రోడ్
మెన్లో పార్క్, కాలిఫోర్నియా 94025
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
మీరు కాపీరైట్ ఉల్లంఘన క్లెయిమ్‌ను రిపోర్ట్ చేయడానికి ముందు, మీ కాపీరైట్‌ను ఉల్లంఘిస్తుండవచ్చని మీరు విశ్వసించే సంబంధిత WhatsApp వినియోగదారుకు సందేశం పంపవచ్చు. మీరు నేరుగా వారితోనే సమస్యను పరిష్కరించుకోగలగవచ్చు.
ట్రేడ్‌మార్క్ అనేది ఒక వ్యక్తి, గ్రూప్ లేదా కంపెనీ అందించే ఉత్పత్తులు లేదా సేవలు మరొక దాని నుండి వేరుగా ఉండేలా చేసే పదం, నినాదం, చిహ్నం లేదా డిజైన్ (ఉదాహరణ: బ్రాండ్ పేరు, లోగో). సాధారణంగా, ట్రేడ్‌మార్క్ చట్టం అనేది ఎవరు ఉత్పత్తి లేదా సేవను అందిస్తున్నారు లేదా దానితో అనుబంధంగా ఉన్నారనే విషయంలో వినియోగదారులకు గందరగోళం లేకుండా చేస్తుంది.
WhatsAppలోని కంటెంట్ మీ ట్రేడ్‌మార్క్ పనిని ఉల్లంఘిస్తున్నట్లు మీరు విశ్వసిస్తే, కాంటాక్ట్ ఫారమ్‌ను పూరించడం ద్వారా మీరు దాన్ని రిపోర్ట్ చేయవచ్చు.
మీరు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన క్లెయిమ్‌ను రిపోర్ట్ చేయడానికి ముందు, మీ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘిస్తుండవచ్చని మీరు విశ్వసించే సంబంధిత WhatsApp వినియోగదారుకు సందేశం పంపవచ్చు. మీరు నేరుగా వారితోనే సమస్యను పరిష్కరించుకోగలగవచ్చు.
ఒక వ్యక్తి పునరావృతంగా మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించే కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లయితే, క్రిందివి సంభవించవచ్చు:
అప్పీల్ కారణంగా లేదా హక్కుల యజమాని వారి రిపోర్ట్‌ను ఉపసంహరించుకున్నందున మేము తీసుకునే చర్యలలో ఏదైనా రివర్స్ చేయబడినట్లయితే, మా పునరావృత అతిక్రమణదారు విధానం ప్రకారం మేము దాన్ని పరిగణనలోకి తీసుకుంటాము.
మేధోసంపత్తి నివేదన కారణంగా మీ ఛానెల్ నుంచి మేము మీ కంటెంట్‌ను తీసివేసినట్లయితే, అలాగే మేము అలా చేసి ఉండకూడదని మీరు విశ్వసిస్తే, మీరు ఒక అప్పీల్‌ను సమర్పించవచ్చు.
మీ ఛానెల్‌పై తీసుకున్న మేధోసంపత్తి చర్యను అప్పీల్ చేయడానికి, బ్యానర్‌పై ఛానెల్ హెచ్చరికలు నొక్కండి లేదా మీ ఛానెల్ పేరు > ఛానెల్ హెచ్చరికలు నొక్కండి.