చివరిగా అప్‌డేట్ చేసినది: 16 ఫిబ్రవరి, 2024
WhatsApp అనేది మెసేజ్‌లను పంపడానికి మరియు కాల్‌లు చేసుకోవడానికి ఉద్దేశించబడిన ఒక సులభమైన, సురక్షితమైన మరియు నమ్మదగిన మార్గం. డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన మీ వ్యక్తిగత మెసేజ్‌లను ఇతరులు ఎవరూ, చివరికి WhatsApp కూడా చూడలేదు.
1:1 చాట్‌లు, కాల్‌లు, గ్రూప్ చాట్‌లు మరియు కమ్యూనిటీలకు ఈ మెసేజింగ్ మార్గదర్శకాలు (ఈ “మార్గదర్శకాలు”) వర్తిస్తాయి. స్టేటస్ అప్‌డేట్‌లు కూడా ఈ మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి.
WhatsApp Messenger అప్లికేషన్ యొక్క వినియోగం మా సేవా నిబంధనలు మరియు ఈ మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడుతుంది. WhatsApp Business అప్లికేషన్ మరి.యు WhatsApp Business ప్లాట్‌ఫామ్‌లతో కూడిన మా వ్యాపార సేవల వినియోగం ఈ మార్గదర్శకాలకు అదనంగా WhatsApp Business సేవా నిబంధనలు మరియు వ్యాపార విధానాల ద్వారా నిర్వహించబడుతుంది.
ప్రాథమిక అకౌంట్, గ్రూప్ మరియు కమ్యూనిటీ ప్రొఫైల్ సమాచారంతో పాటు ఇతర వినియోగదారులు నివేదించిన మెసేజ్‌లతో సహా WhatsAppకి అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం ఆధారంగా మా సేవా నిబంధనలు లేదా ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలపై WhatsApp చర్య తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి.
ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న WhatsApp కాంటాక్ట్స్, గ్రూపులు, కమ్యూనిటీలు, స్టేటస్ అప్‌డేట్‌లు లేదా నిర్దిష్ట మెసేజ్‌లను వినియోగదారులు నివేదించగలరు. WhatsAppలో నివేదించడం ఎలా అనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోగలరు. సంభవనీయ మేధో సంపత్తి ఉల్లంఘనలను నివేదించే విధానానికి సంబంధించిన సమాచారం కోసం, దయచేసి ఇక్కడ చూడండి.
ఈ మార్గదర్శకాల సంభవనీయ ఉల్లంఘనల కోసం అకౌంట్, గ్రూప్ మరియు కమ్యూనిటీ ప్రొఫైల్ సమాచారంతో పాటు నివేదించబడిన మెసేజ్‌లతో సహా మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుర్తించడానికి మరియు సమీక్షించడానికి WhatsApp ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ పద్ధతులు మరియు మానవ సమీక్షా బృందాలు రెండింటినీ ఉపయోగించవచ్చు.
ఆటోమేటిక్ చేయబడిన డేటా ప్రాసెసింగ్ అనేది మా సమీక్ష ప్రక్రియలో ప్రధానమైనదిగా ఉండడంతో పాటు అకౌంట్ ప్రవర్తన లేదా నివేదించబడిన మెసేజ్ కంటెంట్ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలను ఆటోమేటిక్‌గా అమలు చేస్తుంది.
ఉల్లంఘించే అవకాశమున్న అకౌంట్‌లు, గ్రూపులు లేదా కమ్యూనిటీలలోని కంటెంట్‌ను సరైన పరిజ్ఞానం మరియు భాషా నైపుణ్యం ఉన్న మానవ సమీక్షకులకు మళ్లించడం ద్వారా సమీక్షకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే వేగవంతం చేయడంలో ఆటోమేషన్ మాకు సహాయపడుతుంది, తద్వారా మా బృందాలు ముందుగా అత్యంత ముఖ్యమైన కేసులపై దృష్టి పెట్టవచ్చు.
అకౌంట్, గ్రూప్ లేదా కమ్యూనిటీకి తదుపరి సమీక్ష అవసరమైనప్పుడు, తుది నిర్ణయం తీసుకోవడానికి మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు దానిని మానవ సమీక్షా బృందానికి పంపుతాయి. మా మానవ సమీక్షా బృందాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటిలోని సభ్యులు క్షుణ్ణమైన శిక్షణ పొంది తరచుగా నిర్దిష్ట విధాన ప్రదేశాలు మరియు ప్రాంతాలలో ప్రత్యేకతను కలిగి ఉండడంతో పాటు అకౌంట్ సమాచారాన్ని అలాగే నివేదించబడిన మెసేజ్‌లను సమీక్షించగలవు. వ్యక్తిగత మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. మా ఆటోమేటెడ్ సిస్టమ్‌లు ప్రతి నిర్ణయం నుండి నేర్చుకోవడంతో పాటు వాటి నుండి తమను తాము మెరుగుపర్చుకుంటాయి.
WhatsAppలోని అకౌంట్‌లు, గ్రూపులు లేదా కమ్యూనిటీలు స్థానిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వాలు విశ్వసించినప్పుడు, మాకు అందుబాటులో ఉన్న అకౌంట్ సమాచారాన్ని సమీక్షించవలసిందిగా వారు మమ్మల్ని అభ్యర్థించవచ్చు. వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. WhatsApp అకౌంట్‌లను పరిమితం చేయవలసిందిగా మేము కోర్టు నుండి ఉత్తర్వులను కూడా అందుకోవచ్చు. ఏదైనా చర్యను తీసుకోవడానికి ముందు మేము ప్రభుత్వ అభ్యర్థన యొక్క చట్టబద్ధత మరియు సంపూర్ణతను ఎల్లప్పుడూ అంచనా వేస్తాము.
చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మా నిబంధనలు మరియు విధానాల ఉల్లంఘన వంటి వాటి గురించి మాకు తెలిసినప్పుడు, మేము క్రింది వాటితో సహా కంటెంట్ లేదా ఉల్లంఘన యొక్క స్వభావాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు:
WhatsApp సేవా నిబంధనలలో ప్రతిబింబించే విధంగా మేము అదనపు చర్యలు తీసుకోవచ్చు.