మీరు ఈ అవతార్‌ల ఫీచర్‌లను ఎంచుకున్నట్లయితే, ఈ WhatsApp అవతార్‌ల ఫీచర్‌ల గోప్యతా నోటీసు వర్తిస్తుంది. ఇది సిఫార్సు చేయబడిన అవతార్‌లను జనరేట్ చేయడానికి మరియు అవతార్ కాలింగ్‌కు మద్దతు ఇవ్వడానికి మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు రక్షిస్తామనే విషయాలను వివరించడంతో పాటు
WhatsApp గోప్యతా విధానానికి అనుబంధంగా ఉంటుంది.
సిఫార్సు చేయబడిన అవతార్‌లు
సిఫార్సు చేయబడిన అవతార్‌ల ఫీచర్ మీ అవతార్‌ను సృష్టిస్తున్నప్పుడు మీరు క్యాప్చర్ చేసి, సమర్పించే మీ ఫోటోను ఉపయోగించి మీకు అవతార్‌లను త్వరగా సిఫార్సు చేయడానికి WhatsApp, LLCని అనుమతిస్తుంది. మీరు సిఫార్సు చేయబడిన అవతార్‌ల ఫీచర్‌ను ఉపయోగించాలని ఎంచుకున్నట్లయితే, మీరు ఈ గోప్యతా నోటీసుకు అంగీకరించవలసి ఉంటుంది.
సిఫార్సు చేయబడిన అవతార్‌ల ఫీచర్‌ను అందించడానికి ఉపయోగించబడే సమాచారం
WhatsApp మీ రూపం నుండి ప్రేరణ పొందిన అవతార్‌లను సిఫార్సు చేయడానికి, మేము మీ కళ్లు, ముక్కు మరియు నోరు వంటి మీ ముఖంలోని భాగాల స్థానాన్ని మరియు మీ ముఖంలోని ఆ భాగాల యొక్క ఆకృతులపై నిర్దిష్ట బిందువులను ("అంచనా వేసిన ముఖ బిందువులు") అంచనా వేయడానికి మీ ఫోటోను విశ్లేషిస్తాము. మీ ముఖంలోని నిర్దిష్ట ప్రాంతాల ("అంచనా వేసిన ముఖ లక్షణాల") యొక్క సుమారు పరిమాణం, ఆకారం మరియు రంగు పిగ్మెంట్‌ను గుర్తించడానికి కూడా మేము మీ ఫోటోను విశ్లేషిస్తాము. ఆపై మా సాంకేతికత మీ అంచనా వేయబడిన ముఖ బిందువులు మరియు అంచనా వేయబడిన ముఖ లక్షణాలను ఉపయోగించడం ద్వారా మీ నుండి ప్రేరణ పొందిన అవతార్‌లను సృష్టిస్తుంది, ఆ తర్వాత WhatsApp మీకు వాటిని సిఫార్సు చేస్తుంది. మీరు ఎంచుకుంటే, మీ తుది అవతార్‌ను ఎంచుకోవడానికి ముందు సిఫార్సు చేయబడిన అవతార్‌లను అనుకూలీకరించడానికి మీరు అవతార్ ఎడిటర్ టూల్‌ను ఉపయోగించవచ్చు. ఈ సమాచారం ఏదీ మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగించబడదు, అలాగే ఇది మీ నుండి ప్రేరణ పొందిన అవతార్‌లను సిఫార్సు చేసే ఏకైక ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
మీరు మీ తుది అవతార్‌ని ఎంపిక చేసుకున్న తర్వాత, మీ ఫోటో, అంచనా వేయబడిన ముఖ బిందువులు, అంచనా వేయబడిన ముఖ లక్షణాలు మరియు సిఫార్సు చేయబడిన అవతార్‌లు వెంటనే తొలగింపు కోసం ప్రాసెస్ చేయబడడం ప్రారంభం అవుతుంది. మొత్తం తొలగింపు ప్రక్రియ పూర్తి కావడానికి గరిష్టంగా 14 రోజులు పట్టవచ్చు.
WhatsApp గోప్యతా విధానానికి లోబడి, మీ తుది అవతార్ WhatsApp ద్వారా మరియు మీ పరికరంలో నిల్వ చేయబడుతుంది, తద్వారా మీరు WhatsAppలోని ఇంటరాక్టివ్ డిజిటల్ అనుభవాల కోసం దీనిని ఉపయోగించగలరు. మీ తుది అవతార్ సృష్టించబడిన తర్వాత, మీ WhatsApp అవతార్ సెట్టింగ్‌లలో “అవతార్‌ను తొలగించు” క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు మీ WhatsApp ఖాతాను తొలగిస్తే, మీ తుది అవతార్ కూడా ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.
అవతార్ కాలింగ్
అవతార్ కాలింగ్ ఫీచర్‌తో, మీరు WhatsApp వీడియో కాల్‌లలో మీ వ్యక్తిగత అవతార్ రూపంలో పాల్గొనవచ్చు. అవతార్ కాలింగ్ అనేది మీ వీడియోని మీ లైవ్ అవతార్‌తో భర్తీ చేసే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్.
అవతార్ కాలింగ్ ఫీచర్‌ను అందించడానికి ఉపయోగించబడే సమాచారం
మీరు అవతార్ కాలింగ్‌ను ఉపయోగించాలని ఎంచుకున్నట్లయితే, వీడియోలో మీరు ఉండే చోట మీ అవతార్ కనిపించడంతో పాటు అది మీ ముఖంలోని భావాలు మరియు కదలికలను (కెమెరా ఎఫెక్ట్‌లు) నిజ సమయంలో ఉన్నట్లుగానే ప్రదర్శిస్తుందని మేము నిర్ధారించుకోవాలి.
అవతార్ కాలింగ్ సౌలభ్యాన్ని అందించడానికి, WhatsApp (మీ కళ్లు, ముక్కు లేదా నోరు వంటి) మీ ముఖంలోని భాగాల స్థానాన్ని మరియు మీ ముఖంలోని ఆ భాగాల యొక్క ఆకృతులపై నిర్దిష్ట బిందువులను ("అంచనా వేసిన ముఖ బిందువులు") అంచనా వేయడానికి మీ ఫోటోను విశ్లేషిస్తుంది. మేము ఈ అంచనా వేసిన ముఖ బిందువులను ముఖం యొక్క సాధారణ నమూనాకు వర్తింపజేయడంతో పాటు మీ ముఖంలోని భావాలు మరియు కదలికలను అనుకరించేలా సర్దుబాటు చేస్తాము.
మిమ్మల్ని గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగించబడదు. మీ వీడియో కాల్‌ల సమయంలో అవతార్ కాలింగ్ ఫీచర్‌ను అందించడానికి మాత్రమే ఇది ఉపయోగించబడుతుంది. మీరు ఫీచర్‌ని ఉపయోగించడం ఆపివేసినప్పుడు లేదా వీడియో కాల్ ముగిసినప్పుడు, మేము ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం ఆపివేస్తాము. మేము ఈ సమాచారాన్ని నిల్వ చేయడం లేదా మూడవ పక్షాలతో షేర్ చేయడం వంటివి చేయము.
WhatsApp గోప్యతా విధానానికి లోబడి, మీ అవతార్ WhatsApp ద్వారా మరియు మీ పరికరంలో నిల్వ చేయబడుతుంది, ఆపై అవతార్ కాలింగ్‌కి ఉపయోగించబడవచ్చు. మీ WhatsApp అవతార్ సెట్టింగ్‌లలో “అవతార్‌ను తొలగించు” క్లిక్ చేయడం ద్వారా మీరు దాన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు మీ WhatsApp ఖాతాను తొలగించినట్లయితే, మీ అవతార్ కూడా ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.
యు.ఎస్.లో నివసించే వ్యక్తులకు అదనపు సమాచారం
అవతార్ కాలింగ్ ఫీచర్ అనేది కెమెరా ఎఫెక్ట్‌ల సెట్టింగ్ ద్వారా నియంత్రించబడుతుంది. వర్తించే చట్టాలకు అనుగుణంగా, అవతార్ కాలింగ్‌ను ఆన్ చేయడానికి, మీరు ఈ గోప్యతా నోటీసుకు అంగీకరించవలసి ఉంటుంది, ఇది కెమెరా ఎఫెక్ట్‌లు సెట్టింగ్‌ని ఆన్ చేస్తుంది. మీరు మీ WhatsApp గోప్యతా సెట్టింగ్‌లలో మీ కెమెరా ఎఫెక్ట్‌లు సెట్టింగ్‌ని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు. సెట్టింగ్ ఆఫ్ చేయబడినట్లయితే, అవతార్ కాలింగ్ అందుబాటులో ఉండదు, కానీ మీరు అన్ని ఇతర WhatsApp ఫీచర్‌లకు యాక్సెస్‌ను ఇప్పటికీ కలిగి ఉంటారు.
మీరు అవతార్ కాలింగ్‌ని ఉపయోగించినప్పుడు, మీ వీడియో కాల్ వైపున కనిపించే ఇతర వ్యక్తుల చిత్రాల నుండి మేము సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు. అవతార్ కాలింగ్ మరియు కెమెరా ఎఫెక్ట్‌ల సెట్టింగ్‌ని ఆన్ చేయడం ద్వారా, మీ వీడియోలో కనిపించే వ్యక్తులందరూ కూడా తమ WhatsApp ఖాతాలలో కెమెరా ఎఫెక్ట్‌ల సెట్టింగ్‌ని ఆన్ చేసి ఉన్నా లేదా మీరు వారి చట్టబద్ధమైన అధీకృత ప్రతినిధి కావడంతో పాటు వారి తరఫున ఈ నోటీసు నిబంధనలకు సమ్మతిస్తే మాత్రమే మీరు ఫీచర్‌ను ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.