ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి
మీ గోప్యతకు మేము ప్రాధాన్యతనిస్తాము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా, మీ వ్యక్తిగత మెసేజ్‌లను మీరు మరియు వాటిని మీరు ఎవరికి పంపారో వారు మాత్రమే చూడగలరని నిర్ధారించుకోవచ్చు.
మీ గోప్యతకు మేము ప్రాధాన్యతనిస్తాము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా, మీ వ్యక్తిగత మెసేజ్‌లను మీరు మరియు వాటిని మీరు ఎవరికి పంపారో వారు మాత్రమే చూడగలరని నిర్ధారించుకోవచ్చు.
మెసేజ్‌లు మరియు కాల్‌లు మీ మధ్యనే ఉంటాయి. వాటిని వేరెవ్వరూ, చివరికి WhatsApp కూడా చదవడం లేదా వినడం సాధ్యపడదు.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మాత్రమే కాకుండా, మీ సంభాషణలన్నింటికీ మేము అదనపు స్థాయిల్లో రక్షణను జోడిస్తాము.
మీరు వేటిని షేర్ చేయాలి, మీరు ఆన్‌లైన్‌లో ఎలా కనబడాలి లేదా మీతో ఎవరెవరు మాట్లాడవచ్చు అనే వాటిని మీరే ఎంచుకోవచ్చు.
మీ అత్యంత వ్యక్తిగత చాట్‌లను పాస్‌వర్డ్ రక్షిస్తుంది, కాబట్టి ఎవరూ కూడా మీ ఫోన్‌ను ఉపయోగించి వాటిని చూడలేరు.
అదృశ్యమయ్యే మెసేజ్‌లతో, ఏయే మెసేజ్‌లు అలాగే ఉండాలి మరియు అవి ఎంతసేపు ఉండాలి వంటివి మీరు నియంత్రించవచ్చు, ఇందుకోసం వాటిని మీరు పంపిన తర్వాత అదృశ్యమయ్యేలా సెట్ చేయవచ్చు.
స్పామ్ మరియు తెలియని కాంటాక్ట్‌లు మీకు కాల్ చేయకుండా వారిని తీసివేయండి, దీని వల్ల మీకు నిజంగా ముఖ్యమైన సంభాషణలపై మీరు దృష్టి సారించవచ్చు.
మీ ఆన్‌లైన్ బ్యాకప్‌లను ప్రైవేట్‌గా ఉంచండి. iCloud లేదా Google Driveలో సేవ్ అయ్యిన మీ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతను విస్తరింపజేయడానికి ఎన్‌క్రిప్ట్ చేయబడిన బ్యాకప్‌లను ఆన్ చేయండి.
మీకు కావాల్సిన వారు మాత్రమే మిమ్మల్ని చూడగలిగేలా ఎంచుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉన్నారు, చివరిసారిగా WhatsAppను ఎప్పుడు ఉపయోగించారు అనే వివరాలు ఎవరికి కనబడాలో ఎంచుకోవడానికి మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.
హ్యాకర్‌లు మరియు స్కామర్‌ల నుంచి మీ ఖాతాను రక్షించుకోండి
మరియు అవాంఛిత చాట్‌లను ఆపివేయండి.